Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా?.. ప్రకాశ్‌ రాజ్‌పై బండ్ల గణేశ్‌ ఫైర్‌

Bandla Ganesh Fires At Prakash Raj Over Tweet On Pawan Kalyan
Advertisement
  • పవన్ కల్యాణ్‌పై పోస్ట్‌కు కౌంటర్‌గా బండ్ల స్పందన
  • ప్రతి విషయంలో జోక్యం చేసుకోవద్దని హితవు
  • నీ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలంటూ కౌంటర్ 
  • తర్వాత ప్రపంచాన్ని మార్చాలంటూ ఘాటు వ్యాఖ్యలు
Advertisement
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ ఇటీవల తెలంగాణలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ‘‘మీరొస్తానంటే మేమొద్దంటామా?’’ అంటూ వ్యగ్యంగా ప్రకాశ్ రాజ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దీనిపై స్పందించిన బండ్ల ముందు ‘‘నీ అడ్రస్‌ ఏంటో తెలుసుకో’’ అంటూ అదే ‘ఎక్స్‌’ వేదికగా ఘాటుగా స్పందించారు. 

‘‘నీకెందుకు ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి అంశంలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. పని లేకపోతే చూసుకో. కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్!’’ అంటూ బండ్ల గణేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. 

తెలంగాణ మొత్తం తిరుగుతానని, ఈసారి ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని పవన్ కల్యాణ్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పరోక్షంగా స్పందించిన ప్రకాశ్‌ రాజ్‌ ‘‘సింగిల్‌గా వస్తారా? లేదా పొత్తుతో వస్తారా? అని ప్రశ్నించారు. ముందు అది చెప్పి రావాలని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement
Bandla Ganesh
Prakash Raj
Pawan Kalyan
Tollywood
Bandla Ganesh comments
Janasena

More Telugu News